26-09-14

ఏడవకే నా హృదయమా

ఏడవకే నా హృదయమా ఏది ఏమైనా ..
మాయదారి  జీవితాన ..మంచి కడతేరినా మిన్నకుండవే మనసా ..

మాటలే కరువైనా ... మనోవ్యదే నిను  వెంటాడినా
అశ్రువులే ఆవిరైనా ... కలలన్నీ కల్లలైనా..
ఏడవకే నా హృదయమా ఏది ఏమైనా ..

కడతేరక నీ తోడుంటా కతమారేవరకు
కలబడతా విధితో నా కట్టె కాలేవరకు
ఏడవకే నా హృదయమా ఏది ఏమైనా ..




క్షమించు బంధమా

నీ మాట వింటే నను మంచోడినంటావ్ !
వినకపోతే .... మూర్కుడినంటావ్

లోకాన్ని చూసి బతకమంటావ్ !
నవ్వలేనని బెదిరిస్తావ్

బంధం మాటున నువ్వెన్ని బంధనాలు వేసినా ...
నాలోని నేను ప్రతి క్షణం బ్రతికే ఉంటాను . నా మది మాటే వింటాను

క్షమించు బంధమా ... నా తర్వాతే నువ్వు

29-03-13

ఎప్పటికీ నీ వాడినే

కాలతన్నావు నా మదిని  , కాదనుకున్నావు నా ప్రేమని .

కటినమైనదని తెలుసు నీ హృదయం ,

ఐనా  నీ రూపమే నా కనుంగవకు నిత్య దర్శనం . 

గడిపానేన్నో  కదలని గడియలు .. చుసానేన్నో చీకటి రోజులు ,


నీ ఆత్మీయతనెరుగక  అంధకారమని తెలుసు నా జీవనపయనం,  

నిను ద్వేషించమంటున్న నా జ్ఞానాన్ని జయిస్తూనే వుంది నా హృదయం 

ఎప్పటికీ నీ వాడినే 

నరేంద్ర 

28-07-12

సౌందర్యం !!

సౌమ్యమైన నీ మోము మోముని చూడగ  సడి పెంచెను నా హృది
కలువంటి నీ నయనమ్ములు చూడగ నిదురన్నది రాకున్నది

వయ్యారి నీ నడకను చూడగ వాగులైన చింతించునే
వెన్నెలంటి నీ నవ్వును చూడగ వేసవి మల్లెలు చిన్నబోవునే !!

నీ మేను తాకగ పరవశించిన పవనమ్మును నా ఊపిరిలో బందించనా ..
నీ చరణముల్ తాకగ పునీతమైన  ధరతిని నా నుదుటిన సిందూరం సేయనా ..

                                     నీ ఆణువణువూ   సౌందర్యం ..
                                     సౌమ్యమైన మనసే సౌందర్యం
 నరేంద్ర


03-03-12

ప్రతి క్షణం !!

వున్నా నీ ప్రమలో ప్రతి క్షణం 
నా హృదయమే అయ్యింది నీ ఆలయం 
ప్రతి నిమిషం నీ నామ స్మరణతో పరవసిస్తోంది నా ప్రాణం ..
ప్రేమ నువ్వు ..నా ప్రాణం నువ్వు
ప్రతి  క్షణం నా జీవితం నీకే అంకితం.. @> ----- 

03-11-10

నాలో నువ్వు ఐక్యం !!

నా  కనుల  మాటున అందం 
నా స్వాసై   నిండిన శ్రావ్యం 

నా  మనోరంజన   మంత్రం
నా  పాటలోని తీయని  స్వరం 

నా  బాధల్ని  మరిపించు  బందం
నా  ఆనందం  వెనుక  అర్ధం

నాలో  నువ్వు  ఐక్యం 
నీకోసమే ఈ జీవితం 
నా  ప్రాణమా ఇది  నిజం ..

 నరేంద్ర 

28-10-10

ప్రియతమా ఎవరు నీవు !!



ప్రియతమా ఎవరు నీవు !!
నడిరేయిలో నను తాకిన వెన్నెలవా 
పరిమళంతో పరవశించే కుసుమనివా 
                                                   
                                పురివిప్పి నాట్యమాడే మయూరివా
                                చిరు స్పర్శతో చలిరేపే తొలకరిజల్లువా  



ఓ ప్రియతమా 
గగనాన  ఎగిరే శాంతికపోతమై వస్తావో 
గిరులపై జాలువారే సెలయేరులా వస్తావో 


                                 నా ప్రేమ సామ్రాజ్యపు పట్టపురాణివై.. 
                                 చీకటిని చీల్చే చిరుదివ్వెలా నువ్వొస్తావని,


నీ హృదిలో చోటిస్తావని
నీకోసం,నీ ప్రేమ కోసం 
నీ వలపువాకిట నే వేచియున్నా...

నీకోసం ప్రతిక్షణం ...

నరేంద్ర